
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఎయిర్ వింగ్, పారామెడికల్, వెటర్నరీ విభాగాల్లోని 170 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు 26 జులై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టుల అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం..
బీఎస్ఎఫ్ గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు. పారామెడికల్, వెటర్నరీ పోస్టులకు ఒక నోటిఫికేషన్, ఎయిర్ వింగ్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ వేర్వేరుగా బీఎస్ఎఫ్ విడుదల చేసింది. ఈ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
పారామెడికల్ సిబ్బంది - 75
ఎస్సై (స్టాఫ్ నర్స్) నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్-– 37
ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్)
గ్రూప్ సీ పోస్ట్– 1
ఏఎస్సై (ల్యాబరేటరీ టెక్నీషియన్)
గ్రూప్ సీ పోస్ట్- – 28
సీటీ (వార్డ్ బాయ్, వార్డ్ గర్ల్, ఆయా)
గ్రూప్ సీ పోస్ట్- – 9
ఎస్ఐ (స్టాఫ్ నర్స్) పోస్టుకు ఇంటర్, డిగ్రీ/డిప్లొమా (జీఎన్ఎం) ఉత్తీర్ణులై ఉండాలి. ఏఎస్ఐ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్, డిప్లొమా, డీఎంఎల్టీ పాస్ అవ్వాలి. జీతం నెలకు రూ.29,000 ఉంటుంది. సీటీ వార్డ్ బాయ్ / గర్ల్స్‌కు టెన్త్ పాస్ అవ్వాలి.
వెటర్నరీ సిబ్బంది - 35
హెచ్‌సీ (వెటర్నరీ) గ్రూప్ సీ పోస్ట్- – 20
కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్) గ్రూప్ సీ పోస్ట్- – 15
హెచ్‌సీ (వెటర్నరీ) పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. జీతం నెలకు రూ. 25,500 ఉంటుంది. వయసు 25 ఏండ్లు మించకూడదు. కానిస్టేబుల్ జాబ్‌కు పదో తరగతి పాసవ్వాలి. జీతం నెలకు రూ.21,700 ఇస్తారు. జనరల్ అభ్యర్థులకు వయసు 25 ఏండ్లకు మించకూడదు.
ఎయిర్ వింగ్ - 65
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)-– 49
అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)- – 8
కానిస్టేబుల్ (స్టోర్‌మ్యాన్)- – 8
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్, రేడియో మెకానిక్ కు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా. కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) కు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు
ప్రారంభం: 27 జూన్
చివరి తేదీ: 26 జులై
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.
అప్లికేషన్ ఫీజు: రూ.100.
వెబ్సైట్: www.bsf.gov.in