కేంద్రీయ విద్యాలయాల్లో కొలువులు

కేంద్రీయ విద్యాలయాల్లో కొలువులు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థుల కోసం  న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్‌‌ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

ప్రైమరీ టీచర్ పోస్టులు:  మొత్తం ప్రైమరీ టీచర్ ఖాళీలు  6414 ఉన్నాయి. (యూఆర్‌‌- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్‌‌- 641)

అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్‌‌ఈడీ, డీఈఎల్‌‌ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్‌‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌‌) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి. 30 సంవత్సరాలకు మించకూడదు. 

సెలెక్షన్​: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవీఎస్‌‌ వెబ్‌‌సైట్ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పీజీటీ, టీజీటీ పోస్టులు: ప్రిన్సిపాల్​, వైస్​ ప్రిన్సిపాల్​ పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్​, ఏఎస్​వో తదితర మొత్తం 6,990 పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. 

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌‌) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో డిసెంబర్​ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం www.static.langimg.com వెబ్​సైట్​లో​ సంప్రదించాలి.