నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగాలు..ఎగ్జామ్ లేకుండా ఎంపిక

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగాలు..ఎగ్జామ్ లేకుండా ఎంపిక

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ ప్రోగ్రామర్, డిప్యూటీ డైరెక్టర్, రీసెర్చ్ సైంటిస్ట్ లు, ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రూప్ A, B, C రిక్రూట్ మెంట్ అర్హత, దరఖాస్తు ప్రక్రియ కు సంబంధించిన మరింత సమాచారం అధికారిక NTA వెబ్ సైట్ లో చూడవచ్చు. 

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లో ఉద్యోగాల దరఖాస్తు కోసం మరిన్ని వివరాలు. 

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత 

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి పోస్టులను బట్టి మారవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలి. 

ఎంపిక ప్రక్రియ:  NTA ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను వారి అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు. 

నోటిఫికేన్ విడుదల: మార్చి 14,2024

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15ఏప్రిల్ 2024

దరఖాస్తు సమర్పణకు చివరి తేది : 05మే, 2024

నేషనల్ టెస్టింగ్  ఏజెన్సీ(NTA) అధికారి వెబ్ సైట్ www. ntarecruitment.ntaonline.in