జాబ్స్ స్పెషల్.. బిట్ బ్యాంక్

జాబ్స్ స్పెషల్.. బిట్ బ్యాంక్
 •  ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులను తెలంగాణ నుంచి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం జోఓ నెంబర్ 36 ద్వారా స్పష్టం చేసింది.
 • ప్రభుత్వ జీవో 36కు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టు 1969 ఫిబ్రవరి 4న రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. 
 • ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం జీవో 36ను కొట్టివేసింది. రాజ్యాంగంలో 16(3) ఆర్టికల్​కు జీవో 36 వ్యతిరేకమని ధర్మాసనం భావించింది. 
 • ఏపీ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు 1971 సెప్టెంబర్​ 25న బాధ్యతలు చేపట్టారు.
 • ఆంధ్రప్రదేశ్​ అవతరణ తర్వాత ముల్కీ నిబంధనలు చెల్లవని 5 న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు పూర్తి బెంచ్​ 4–1 మెజార్టీతో తీర్పును 1972 ఫిబ్రవరి 14న వెలువరించింది.
 •  ముల్కీ నిబంధనలపై హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడానికి పి.వి.నరసింహారావు చొరవ చూపారు. 
 • చారిత్రక పరిస్థితుల రీత్యా తెలంగాణలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్​ 3న తీర్పు వెలువరించింది.
 • 1972 అక్టోబర్ లో ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు వెలువరించిన అంగీకరించని ఆంధ్ర ప్రాంత నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. 
 • కాంగ్రెస్​ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు 1972 డిసెంబర్​ 31న తిరుపతిలో సమావేశమై రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రులు రాజీనామా చేయాలని, ప్రజలు పన్నులు కట్టరాదని, రాష్ట్ర ప్రభుత్వ పాలనను స్తంభింపజేయాలని తీర్మానం చేశారు. 
 • తెలంగాణ– ఆంధ్ర ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను గమనించి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 నవంబర్​ 27న పంచసూత్ర ప్రణాళికను ప్రకటించారు.
 • ముల్కీ నిబంధనలు హైదరాబాద్​ సికింద్రాబాద్​లోని ఉద్యోగాలకు 1977 వరకు తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు 1980 వరకు వర్తిస్తాయని ప్రధాని ఇందిరాగాంధీ వెల్లడించారు. 
 • ప్రధాని ప్రకటనకు నిరసనగా న్యాయవాదులు రాజమండ్రిలో సభ నిర్వహించి 1975 డిసెంబర్​ 5న ఆంధ్ర బంద్​ నిర్వహించారు.
 • పంచసూత్ర పథకాన్ని తిరస్కరించిన నాన్​ గెజిటెడ్​ ఉద్యోగులు 1972 డిసెంబర్​ 7 నుంచి సమ్మె ప్రారంభించారు. 
 • జై ఆంధ్ర ఉద్యమాన్ని జనసంఘ్​, స్వతంత్ర పార్టీ సమర్థించాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు వ్యతిరేకించాయి. 
 • సమైక్యవాదులు 1972 డిసెంబర్​ 24న విజయవాడ నగరంలో చేపట్టిన ఊరేగింపులో హింస చెలరేగింది. ఈ సందర్భంగా సీఆర్​పీఎఫ్​ బలగాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోయారు. 
 • 1972 డిసెంబర్​లో ముల్కీ అనే పదాన్ని నిర్వచించని ఆంధ్ర ప్రాంత నాన్​ గెజిటెడ్​ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
 • తెలంగాణలో పుట్టి పెరిగినవారు ముల్కీలు కాదని, తెలంగాణ వలస వచ్చి స్థిరపడ్డవారే ముల్కీలని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు 1973 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది.
 • ముల్కీ నియమనిబంధనలు ఉద్యోగాల నియామకపు ప్రక్రియలో వర్తిస్తాయే గానీ ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్​, వెనుకటి ఉద్యోగానికి తిరిగి పంపడం, ఉద్యోగం నుంచి తీసివేయడం మొదలైన వాటికి వర్తించవని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు 1973 జులై 11 తీర్పునిచ్చింది. 
 • ఆంధ్రప్రదేశ్​లో 1973 జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించారు.
 • 1972లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ కోదాటి రాజమల్లు 
 •  ఆంధ్ర ప్రాంత నాన్​గెజిటెడ్​ ఉద్యోగులు108 రోజులు సమ్మె చేశారు. 
 • 108 రోజులపాటు సమ్మె చేపట్టిన ఆంధ్ర ప్రాంత నాన్​ గెజిటెడ్​ ఉద్యోగులు 1973 మార్చి 25న సమ్మెను విరమించారు.
 • జై ఆంధ్ర ఉద్యమం తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం కాకాని వెంకటరత్నం మృతి.
 • ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం డిమాండ్​ చేసే నాయకులను ప్రధాని ఇందిరాగాంధీ 1973 ఫిబ్రవరి 7న ఢిల్లీకి ఆహ్వానించారు. 
 • ఆంధ్రప్రదేశ్​లో రాష్ట్రపతి పాలనను 1973 సెప్టెంబర్ 1న పునరుద్ధరించారు.
 • 10 నెలలు జరిగిన జై ఆంధ్ర ఉద్యమం 1973 అక్టోబర్​లో నిలిచిపోయింది.