వైట్ హౌస్ వార్..జో బిడెన్ ముందంజ

వైట్ హౌస్ వార్..జో బిడెన్ ముందంజ

అమెరికాలో ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ట్రంప్,బిడెన్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఐతే ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో జో బిడెన్ ముందున్నారు. జో బిడెన్ 209 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా….. ట్రంప్ 118 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్  రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి.

కెంటకీ, ఇండియానా, టెన్నెస్సీ, వెస్ట్ వర్జీనియా, ఒక్లాహామా, మిసిసిప్పి, అలబామా, అర్కాన్సాస్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, ఇడాహో, నెబ్రాస్కా, మిస్సోరి, ఉటా, కాన్సాస్, సౌత్ కరోలినా,లూసియానా, వ్యోమింగ్ లో ట్రంప్ విజయం సాధించగా……..కాలిఫోర్నియా, ఒరెగావ్, వాషింగ్టన్, వెర్మాంట్, వర్జినియా, న్యూ జెర్సి, రోడ్ ఐలాండ్, మసాచ్యూ సెట్స్, కొలరాడో, కనెక్టికట్, న్యూ హంప్ షైర్, న్యూ మెక్సికో, న్యూయార్క్ లో బిడెన్ గెలుపొందారు.

అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా..270 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వారు అధ్యక్ష పీఠం దక్కించుకోనున్నారు. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో అధ్యక్ష ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యధికంగా కాలిఫోర్నియాలో 55, టెక్సాస్38, న్యూయార్క్, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్ లో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.