
లార్డ్స్లో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్ ఇంగ్లాండ్ బ్యాట్సమన్ మ్యాజిక్ షోతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ టెస్టులో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించిన రూట్..టెస్టుల్లో ఇంగ్లాండ్ తరపున 10 వేల పరుగులు చేసిన రెండో బ్యాట్సమన్గా చరిత్రకెక్కాడు. అయితే తొలి టెస్ట్‌లో రూట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో సైలెంట్ గా మ్యాజిక్ చేశాడు. ఇది కెమెరాకు చిక్కడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
I thought @newbalance is just the company name.
— Muhammad Yunus ?? ?? (@Naveed_YounasPK) June 6, 2022
Just Watch Root's Bat at Non-striker end. #JoeRoot #ENGvsNZ #testcricket #newbalance #pakvswi pic.twitter.com/7lwp2LBTq9
సపోర్ట్ లేకుండానే..
ఫస్ట్ టెస్టు నాలుగో రోజు రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 87పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను నాన్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌కు దిగాడు. అయితే నాన్ స్ట్రైకర్గా ఉన్న రూట్..తన బ్యాట్ను స్ట్రెయిట్గా నిలబెట్టాడు. పిచ్ పై ఎలాంటి సపోర్ట్ లేకుండానే బ్యాట్ నిటారుగా నిలబడింది. ఇక జేమీసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మళ్లీ బ్యాట్ను పట్టుకున్నాడు. ఈ సంఘటన చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ...ఆశ్చర్యానికి గురవుతున్నారు. రూట్ మ్యాజిక్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
Seriously is that bat holding itself up or is Joe Root even more of a magician?? @BumbleCricket @root66 #ENGvsNZ pic.twitter.com/bcHVvPngY4
— Webbo (@WebboOne) June 5, 2022
అదెలా సాధ్యం..
పిచ్పై బ్యాట్ నిలబడానికి కారణం..రూట్ బ్యాట్ చివరన ఫ్లాట్గా ఉండటమే. అంతేకాకుండా అక్కడ నేల కూడా ఫ్లాట్గా ఉండటంతోనే ఇది సాధ్యమైందంటున్నారు కొందరు నెటిజన్లు. దీనికి తోడు నాన్ స్ట్రైక్ ఎండ్లో చిన్న గుంత ఉండొచ్చు..అందులోనే రూట్ తన బ్యాట్ను నిలబెట్టి ఉంటాడని చెబుతున్నారు. మొత్తానికి రూట్ బ్యాట్ ను ఎలా నిలబెట్టినా..ఈ ఘటన మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. కామెంట్లతో ఆ వీడియోపై హోరెత్తుతోంది.
The whole weight of the bat is on the lower quarter.
— Pabin (@Pabin_Pavithr) June 6, 2022
Watch Video:- https://t.co/qlbgltta9h
— CRICKETNMORE (@cricketnmore) June 6, 2022
Joe Root 'The Magician' At Work ?#Cricket #ENGvNZ #JoeRoot pic.twitter.com/jxE4lQX5GJ
No wonder the company's name is New Balance.
— Anuj Prabhu ?? (@PrabhuKaGyaan) June 5, 2022