పవన్ సినిమాల్లోనే ప్రొఫెషనల్.. రాజకీయాల్లో కాదు.. జోగినాయుడు సంచలన కామెంట్స్

పవన్ సినిమాల్లోనే ప్రొఫెషనల్.. రాజకీయాల్లో కాదు.. జోగినాయుడు సంచలన కామెంట్స్

టాలీవుడ్ నటుడు జోగి నాయుడు పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పవన్ సినిమాల్లోనే ప్రొఫెషనల్.. రాజకీయాల్లో కాదు అంటూ విమర్శించాడు. " ప్రజారాజ్యం పార్టీలో తాను కార్యకర్తగా పనిచేశనని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని,ఆ పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ నాకు నచ్చలేదని, సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి కానీ.. అవి ఆచరించకుండా సినిమాటిక్ పనులు చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ మళ్ళీ మాయం అవుతున్నారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ప్రొఫెషనల్ అని.. రాజకీయాల్లో కాదని, రాజకీయాల్లో జగన్ గారు ప్రొఫెషనల్ అని పేర్కొన్నాడు. జగన్ కి కూడా వ్యాపారాలు ఉన్నాయి. కానీ తన వ్యాపార బాధ్యతలని మరొకరికి అప్పగించి రాజకీయాలు చేస్తున్నారని, పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. గత నాలుగేళ్ళ కాలాన్ని పవన్ కళ్యాణ్ వృధా చేశారని ఆరోపించిన జోగి నాయుడు.. ఈ నాలుగేళ్లు పవన్ ప్రజల్లోనే ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోమని సూచించాడు.

పవన్ కళ్యాణ్ ఒక స్టార్ గా ప్రజల్లో ఉంటున్నారే కానీ, నాయకుడిగా నమ్మకం కలిగించలేకపోయారన్నారు. అందుకే ప్రజలు ఆయనకి పట్టం కట్టడం లేదని, నెలకోసారి వచ్చి మీటింగ్ పెట్టి సినిమా తరహాలో ప్రసంగించి వెళ్ళిపోతే ఏం లాభం ఉండదన్నారు. రాజకీయాలన్నాక ఓపిగ్గా ప్రజల్లోనే ఉండాలని, పవన్ లో ఆ లక్షణం లేదు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జోగినాయుడు.   మరి జోగినాయుడు చేసిన ఈ వ్యాఖ్యలకు జనసేన అభిమానులు,కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.