అలంపూర్, వెలుగు : జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన వివిధ రకాల సీల్డ్, ఆన్లైన్, బహిరంగ వేలం పాటల ద్వారా ఆలయానికి మొత్తం రూ.84,18,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.
ఈ వేలంలో ఫొటోలు, క్యాసెట్ల విక్రయ హక్కును అలంపూర్‌కు చెందిన వెంకటరామి రెడ్డి (రూ.29.55 లక్షలు), కొబ్బరి చిప్పల ఏరుకునే హక్కును నల్గొండకు చెందిన శ్రీనివాస రావు (రూ.18.18 లక్షలు), డాలర్లు, కంకణాల విక్రయ హక్కును బీచ్‌పల్లికి చెందిన నరేశ్‌గౌడ్ (రూ.18 లక్షలు), క్యాంటీన్ నిర్వహణను అలంపూర్‌కు చెందిన నరేందర్ రెడ్డి (రూ.9.29 లక్షలు), శౌచాలయాల నిర్వహణను అలంపూర్‌కు చెందిన శివరాముడు (రూ.9.16 లక్షలు), కొత్తగా ఏర్పాటు చేసిన మొబైల్స్,లగేజీ డిపాజిట్ కౌంటర్‌ను అంపూర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం కుమార్ (రూ.6.10 లక్షలు) దక్కించుకున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.13,21,005 ఆదాయం పెరిగింది. తగిన సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనకపోవడంతో టెంకాయలు-పూజా సామగ్రి, చీరలు, ఒడిబియ్యం సేకరణకు సంబంధించిన మరో మూడు టెండర్లను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
