
వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొన్న వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో.. తమ కంపెనీకి చెందిన కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్‌ను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ సోమవారం ప్రకటించింది. ‘ మా కంపెనీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌ను పాక్షికంగా నిలిపివేస్తున్నాం. మూడో దశ ఎన్‌సెంబుల్ ట్రయల్‌తో సహా నిలిపివేస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ చెప్పలేనటువంటి అనారోగానికి గురయ్యాడు. అందువల్ల మేం ట్రయల్స్‌ను తాత్కాలికంగా ఆపేస్తున్నాం’ అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. దాంతో క్లినికల్ ట్రయల్ కోసం ఆన్‌లైన్ నమోదు వ్యవస్థ మూసివేయబడింది. వాలంటీర్ ఆరోగ్యం గురించి ఆరాతీస్తూ.. పేషంట్ సేఫ్టీ కమిటీ సమావేశమైంది.
‘ఏదైనా క్లినికల్ ట్రయల్‌లో ప్రతికూలతలు ఎదురుకావడం ఊహించిందే. అయితే డ్రగ్ వల్ల సమస్య తలెత్తితే.. ట్రయల్స్ తిరిగి ప్రారంభించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం కొంతకాలం ట్రయల్స్‌ను ఆపేయడం సహజమే’ అని కంపెనీ పేర్కొంది.