
- ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ముగిసినయ్
- జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ మంగళవారంతో ముగిసిందని జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 18 వరకు - కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల అప్లికేషన్లు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షలు, వివరాల సవరణ కోసం 7.77 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
Also Raed : హుజూరాబాద్‌లో బల్మూరి వర్సెస్ కృష్ణారెడ్డి
అలాగే జనవరి నుంచి ఇప్పటివరకు 14.72 లక్షలమంది కొత్తగా ఓటర్లుగా నమోదు కాగా, 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షల మంది ఓటర్ల వివరాలు సవరించారు.
ఈ మార్పులు చేర్పులతో జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.13 కోట్లకు చేరింది. వీరిలో 1.57 కోట్ల మంది పురుషులు కాగా, 1.56 కోట్లమంది స్త్రీలు, 2,226 మంది ఇతరులు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి 18–19 ఏండ్ల వయసున్న ఓటర్లు 2.79 లక్షలుండగా, 19 సెప్టెంబరు నాటికి 6.51 లక్షలకు అంటే 234 శాతం పెరిగింది. ఈ నెల 19 వరకు అందిన దరఖాస్తులన్నింటినీ ఈనెల 27 లోగా పరిష్కరించి తుది జాబితాను అక్టోబర్ 4న పకటించనున్నారు. అభ్యర్థనలు, అభ్యంతరాలకు గడువు ముగిసినప్పటికీ, అర్హులైన పౌరులు తమ దరఖాస్తులను ఎప్పుడయినా పంపుకోవచ్చని ఎన్నికల జాబితా సవరించిన ప్రతిసారీ వాటిని పరిష్కరిస్తామని జాయింట్ సీఈఓ స్పష్టం చేశారు.