- రూ.7.76 కోట్లు మంజూరు
- సర్పంచుల ఆధ్వర్యంలో జరగనున్న పనులు
మెదక్/శివ్వంపేట, వెలుగు: మెదక్జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్కొరత తీవ్రంగా ఉంది. వివిధ పథకాల కింద కొత్త స్కూల్ బిల్డింగ్లు, అదనపు తరగతి గదుల నిర్మానం చేపడుతున్నప్పటికీ టాయిలెట్స్మాత్రం నిర్మించడం లేదు. దీంతో విద్యార్థులు, టీచర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కొన్ని పాఠశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉండగా.. ఒకటి, రెండు టాయిలెట్స్సరిపోవడం లేదు. కొన్నిచోట్ల విద్యార్థినులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి. మరికొన్ని స్కూళ్లలో నిర్వహణ సరిగా లేకపోవడంతో టాయిలెట్స్అధ్వానంగా మారాయి.
కలెక్టర్ చొరవతో నిధులు
కలెక్టర్ రాహుల్రాజ్జిల్లాలో ఏ మండల పర్యటనకు వెళ్లినా విధిగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. అక్కడ వసతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో చాలా స్కూళ్లలో టాయిలెట్స్కొరత తీవ్రంగా ఉండటాన్ని గుర్తించారు. ఆయన చొరవతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 21 మండలాలకు చెందిన 267 పాఠశాలలకు 388 టాయిలెట్స్ మంజూరయ్యాయి. ఇందులో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ఉన్నాయి.
ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షలు
స్కూల్టాయిలెట్స్ను ఆధునిక పద్ధతుల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల చొప్పున 388 టాయిలెట్స్‌కు రూ.7.76 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో టాయిలెట్స్నిర్మించి, ఒక వెస్టర్న్కమోడ్, 4 యూరినల్స్, వాష్‌బేసిన్, ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. టాయిలెట్స్‌లో టైల్స్కూడా వేస్తారు.
సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశం
ఉపాధిహామీ పథకం కింద మంజూరైన స్కూల్టాయిలెట్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఎంఈవోలు, హెచ్ఎంల సమన్వయంతో పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టాయిలెట్స్నిర్మాణం విద్యార్థులు, టీచర్ల తిప్పలు తీరనున్నాయి.
పాఠశాలల వారీగా నిధుల వివరాలు
మండలం స్కూల్స్ టాయిలెట్స్ నిధులు (రూ.లక్షల్లో)
అల్లాదుర్గం 14 20 40
చేగుంట 18 28 56
చిలప్‌చెడ్ 8 13 26
హవేలి ఘనపూర్ 14 24 48
కౌడిపల్లి 17 24 48
కొల్చారం 18 27 54
మనోహరాబాద్ 6 9 18
మాసాయిపేట 7 8 16
మెదక్ 8 10 20
నర్సాపూర్ 17 26 52
నార్సింగి 7 8 16
నిజాంపేట 12 17 34
పాపన్నపేట 16 26 52
రామాయంపేట 10 15 30
రేగోడ్ 9 11 22
పెద్దశంకరంపేట 17 23 46
చిన్నశంకరంపేట 20 29 58
శివ్వంపేట 18 27 54
టేక్మాల్ 17 19 38
తూప్రాన్ 9 14 28
వెల్దుర్తి 5 10 20
