Cricket World Cup 2023: ఆస్ట్రేలియా బౌలర్ కు జేజేలు కొట్టిన చెన్నై అభిమానులు

Cricket World Cup 2023: ఆస్ట్రేలియా బౌలర్ కు జేజేలు కొట్టిన చెన్నై అభిమానులు

మన దేశంలో క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం నలువైపులా ఎక్కడ మ్యాచ్ జరిగినా మన అభిమానులు అక్కడ వాలిపోతారు. టీమిండియాకు సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థికి సైతం ఆశ్చర్యాన్ని గురి చేస్తారు. అయితే ఐపీఎల్ లాంటి మెగా లీగ్ వచ్చినప్పటినుండి అంతర్జాతీయ మ్యాచులను చూడడం తగ్గించేశారు. దాదాపు రెండు నెలలపాటు అభిమానులకి వినోదాన్ని అందించే ఐపీఎల్ కి అంతర్జాతీయ మ్యాచులకన్నా ఎక్కువగా డిమాండ్ ఉందన్నది వాస్తవం. 

ఐపీఎల్ ప్రభావం అభిమానుల్లో ఎంతలా  ఉందనే దానికి నిన్నటి వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తే తెలిసిపోతుంది. చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచులో చెన్నై ఫ్యాన్స్ ఆస్ట్రేలియాను సపోర్ట్ చేస్తూ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎల్లో కలర్ ని అమితంగా ఆరాధించే చెన్నై ఫ్యాన్స్.. ఆస్ట్రేలియాది కూడా ఎల్లో జెర్సీ కావడమే దీనికి కారణం. కొంతమంది ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియాకు తమ మద్దతు తెలిపారు. 

ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజెల్ వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేసాడు. ఈ ఓవర్ తర్వాత థర్డ్ మ్యాన్ వైపుగా ఫీల్డింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు హాజెల్ వుడ్ అంటూ అరుస్తూ కనిపించారు. ఐపీఎల్ లో చెన్నై తరపున హాజెల్ వుడ్ మూడు సీజన్లు  ఆడాడు. ఈ కారణంగానే  హాజెల్ వుడ్ కి చెన్నై అభిమానులు జేజేలు కొట్టారని తెలుస్తుంది. ఐపీఎల్ అంటే ఇష్టం ఉన్నా.. ధోనీని ఎంత అభిమానించినా.. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు అని కొంతమంది అభిమానులు తెలుసుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
కాగా ఈ  మ్యాచులో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని భారత్ 41.2 ఓవర్లలో ఛేజ్ చేసింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు విరాట్ కోహ్లీ (85),రాహుల్ (97) భారీ భాగస్వామ్యంతో భారత్ కి వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని అందించారు.