ఇరాన్ అధ్యక్షుడితో అమెరికా జర్నలిస్టు ఇంటర్వ్యూ రద్దు

ఇరాన్ అధ్యక్షుడితో అమెరికా జర్నలిస్టు ఇంటర్వ్యూ రద్దు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో అమెరికా జర్నలిస్టు క్రిస్టినా అమన్పోర్ ఇంటర్వూ సడెన్గా రద్దు అయ్యింది. అమన్పోర్ హిజాబ్ ధరించలేదని ఇంటర్వ్యూ ఇచ్చేందుకు  రైసి నిరాకరించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన రైసిని.. అమన్పోర్ ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న పరిస్థితుల కారణంగా హిజాబ్ ధరించని.. మహిళతో ఇంటర్వ్యూ చేయలేమని రైసి ప్రతినిధి తెలిపారు. 

ఇరాన్ బయట జరిగిన ఇంటర్వ్యూలకు గతంలో ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా ఇలాంటి నిబంధన విధించలేదని అమన్పోర్ అన్నారు. తాము న్యూయార్క్ లో ఉన్నామని.. అక్కడ హెడ్ స్కార్ఫ్ ధరించే సంప్రదాయం లేదని ఆమె ట్విట్టర్ లో తెలిపారు. రైసి ఇంటర్వ్యూకు రాకపోవడంతో..ఖాళీ కుర్చీ ముందు కూర్చున్న ఫొటోను అమన్పోర్ ట్వీట్ చేశారు. సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ అయిన అమన్పోర్ యూఎస్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ లో కూడా ఒక షో చేస్తుంది.