2024 వరకు జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా..!

2024 వరకు జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా..!

2024  సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలన్ని కొనసాగించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, వచ్చే ఏడాది కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధమవుతోన్న తరుణంలో అప్పటివరకు నడ్డాను పార్టీ చీఫ్‌గా కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం, 

2019 జులైలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మితులైన న‌డ్డా... 2020 జ‌న‌వ‌రి 20న  అమిత్ షా నుండి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. 2023తో ఆయన పదవీకాలం ముగియనుంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడు మూడు సంవత్సరాల చొప్పున వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కావచ్చు. రాష్ట్ర శాఖ‌ల్లో క‌నీసం స‌గం శాఖ‌ల ఎన్నిక‌లు పూర్తయిన త‌ర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేప‌ట్టవ‌చ్చు.