హరిద్వార్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మతాన్ని వాడుకుంటున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. "మతాన్ని వాడుకోవడం కోసం 'జానేవు' (పవిత్రమైన దారం) సరిగ్గా ఎలా ధరించాలో కూడా తెలియకుండానే ఎన్నికల సమయంలో దేవాలయాలను సందర్శించే వ్యక్తులు ఉన్నారు" అని నడ్డా రాహుల్‌ను పరోక్షంగా విమర్శించారు.
హరిద్వార్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు మద్దతుగా అక్కడి మాయాదేవి ఆలయంలో శుక్రవారం సాధువులను ఉద్దేశించి నడ్డా ప్రసంగించా రు. సామాజిక అభివృద్ధి కోసం రాజకీయ పోరాటంలో సహాయం చేసేందుకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి మరోసారి ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని నడ్డా కోరారు.