యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఇవాళ (మే 20, 2026న) తన 43 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న మూవీస్పై కీలక అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇప్పటికే, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజై దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను NTRNeel పేరుతో పిలిచేవారు. అయితే తాజా గ్లింప్స్‌తో ఈ చిత్రానికి అధికారికంగా ‘డ్రాగన్’ (DRAGON) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ గ్లింప్స్ పండుగలా మారింది. ఇందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్, భారీ విజువల్స్, రవి బసృర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిపడేస్తున్నాయి. మరి ముఖ్యంగా, “దేవుడు నాకో గొప్పవరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తుంది.
CASUALTIES : 25 MILLION+ DIGITAL VIEWS ⚠️
— Dragon (@DragonMovieOffl) May 20, 2026
Cause of destruction : #DragonGlimpse 🐉🔥
▶️ https://t.co/XYPh8Btw6j#Dragon #HappyBirthdayNTR pic.twitter.com/nEH6KTulFZ
1967 చీకటి ప్రపంచంలో.. ‘లూగర్’గా ఎన్టీఆర్
ఇప్పటివరకు ‘డ్రాగన్’ కథపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రశాంత్ నీల్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ 1967 నాటి అంతర్జాతీయ ఓపియం ట్రేడ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో సాగే ఈ కథలో, అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన ‘చీఫ్ అసస్సిన్ – లూగర్’ అనే భీకరమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. తారక్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, మాస్ లుక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
గ్లింప్స్‌లో చూపించిన క్రూరమైన, హింసాత్మకమైన చీకటి ప్రపంచం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. ఏప్పటిలాగే, నీల్ తన ప్రత్యేక డార్క్ థీమ్ స్టైల్‌తో ఫ్యాన్స్లో క్యూరియాసిటీని పెంచారు. ఇక బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన భారత నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ పాత్రలో కనిపించనున్నారు. ఇతర ప్రధాన తారాగణంలో రుక్మిణి వసంత్, బిజు మీనన్, ఖుష్బు సుందర్, గురు సోమసుందరం ఉన్నారు.
జస్ట్ 4 నిమిషాల 28 సెకండ్ల నిడివి గల గ్లింప్స్ ఒక్కటే, ఇంతటి భారీ విజువల్ వండర్తో ఉంటే.. ఇంకా సినిమా ఎలా ఉంటుందోనన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
