ఎన్టీఆర్, చిరంజీవి సినిమా! నెట్‌ఫ్లిక్స్‌ CEO వరుస మీటింగ్స్

ఎన్టీఆర్, చిరంజీవి సినిమా!  నెట్‌ఫ్లిక్స్‌ CEO వరుస మీటింగ్స్

నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో టెడ్‌ సరాండొస్‌ (Ted Sarandos) హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోస్ తో వరుస భేటీల్లో పాల్గోంటున్నారు. నిన్న గురువారం (డిసెంబర్ 7న) సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా ఆయన చిరంజీవి, రామ్ చరణ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. 

లేటెస్ట్గా శుక్రవారం మధ్యాహ్నం యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR )తో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు టెడ్ మరియు అతని బృందం పాల్గొన్నారు.  భేటీలో ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్,డైరెక్టర్ కొరటాల శివతో టెడ్ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను తారక్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘మీకూ, మీ బృందానికి విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా, ఫుడ్‌కు సంబంధించిన విషయాలపై మీతో మాట్లాడిన క్షణాలను నేను ఆస్వాదించాను. మీతో గడపడం ఆనందంగా అనిపించింది’’ అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్‌ జత చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

టెడ్‌ సరాండొస్‌ మెగాస్టార్, ఎన్టీఆర్ ఇంటికి రావడంపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఈ మీటింగ్ క్యాజువల్‌గానే జ‌రిగిందా లేక..ఏదైనా ప్రాజెక్టు కోసమా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో ఒక యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేయమని కోరుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ , చిరంజీవి తో సినిమా చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై టెడ్‌ సరాండొస్‌  ఎలా స్పందిస్తారో చూడాలి మరి.