ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప సెట్ లో తారక్ సందడి చేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శెరవేగంగా జరుగుతోంది.
గత రెండు రోజులుగా విరామం లేకుండా జరుగుతున్న షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చాడు సుకుమార్. దీంతో.. చిత్ర యూనిట్ ని కలవడానికి పుష్ప సెట్స్ లో అడుగుపెట్టాడు ఎన్ఠీఆర్. ఆ రేర్ సీన్ ని అక్కడ ఉన్న యూనిట్ సభ్యుల్లో ఒకరు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. అంతే.. ఆ పిక్ కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.
ఇక బన్నీ, తారక్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇద్దరు బావా.. బావా పిలుచుకుంటారు. ఇక ఈ ఫోటో చూసిన ఈ హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. తారక్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.