జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు నవీన్ యాదవ్. భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని.. ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు నవీన్ యాదవ్.
బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్ష పూరిత రాజకీయాలు చేశారని.. తాను అలాంటి రాజకీయాలు చేయనని అన్నారు నవీన్ యాదవ్. అందరిని కలుపుకొని పని చేసి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని.. అభివృద్దే తన ఎజెండా అని అన్నారు నవీన్ యాదవ్.
తనపై, తన కుటుంబంపై వ్యక్తిత్వంపై దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని.. జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని అన్నారు నవీన్ యాదవ్. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు నవీన్ యాదవ్.
►ALSO READ | గెలిచినా.. ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతం: జూబ్లీహిల్స్ ఓటమిపై KTR రియాక్షన్
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు నవీన్ యాదవ్. ఈ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డ్ సృష్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు.
జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరిట(2009లో 21,741) ఉండేది. ఇక, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
