జూబ్లిహిల్స్ పబ్ కేసు: మెడికల్ రిపోర్ట్ లో కీలక విషయాలు

జూబ్లిహిల్స్ పబ్ కేసు: మెడికల్ రిపోర్ట్ లో కీలక విషయాలు

హైదరాబాద్ జూబ్లిహిల్స్ అమ్నేషియా పబ్ కేసుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితురాలిపై అఘాయిత్యం చేసే టైంలో నిందితులు విచక్షణారహితంగా  దాడికి పాల్పడినట్లు రిపోర్ట్ లో వెల్లడించారు డాక్టర్లు. బాధితురాలి శరీరంపై 12 చోట్లకు పైగా కమిలిన గాయాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఓసారి టెస్టులు చేసిన వైద్యులు బాధితురాలికి ఇవాళ  మరోసారి టెస్టులు చేశారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను రెండో రోజు విచారించారు పోలీసులు. జువైనల్ హోమ్ కి వెళ్లి..ముగ్గురు మైనర్లను వేర్వేరుగా విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. సాదుద్దీన్ మాలిక్ మొదటి రోజు చెప్పిన వివరాలతో  ముగ్గురు మైనర్లను అడిగి తెలుసుకున్నారు అధికారులు. బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరో అడిగి తెలుసుకున్నారు.