కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిసాయి.  తన కొడుకుకి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత.  ఏప్రిల్ 16 వరకు కవిత కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని..అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితను  మరో 15 రోజులు రిమాండ్ కోరింది ఈడీ.   కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు  టైం కావాలని కోరింది ఈడీ.  ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

లిక్కర్ కేసులో ఈ నెల15 న అరెస్టయిన కవితకు ఫస్ట్ వారం రోజుల కస్టడీ విధించింది కోర్టు..మార్చి 23తో కస్టడీ ముగియడంతో మళ్లీ 26 వరకు కస్టడీ పొడిగించింది. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశ పెట్టింది ఈడీ. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసింది.  ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది