20న జాతీయ లోక్ అదాలత్.. తక్కువ ఖర్చుతో కోర్టు కేసులు పరిష్కరించుకోవాలి..గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

20న జాతీయ లోక్ అదాలత్.. తక్కువ ఖర్చుతో కోర్టు కేసులు పరిష్కరించుకోవాలి..గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల టౌన్, వెలుగు: జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయ పరిష్కారం అందించేందుకు ఈ జాతీయ లోక్ అదాలత్​ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశమున్న క్రిమినల్ కేసులు, కుటుంబ, సివిల్ వివాదాల కేసులు పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.