హిట్ అన్నారు.. వందకోట్లు అన్నారు.. నాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. 70 వేలు లాస్

హిట్ అన్నారు.. వందకోట్లు అన్నారు.. నాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. 70 వేలు లాస్

దసరా(Dasara) సినిమాపై జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ శ్రీను(Agent srinu) సంచలన కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దసరా మూవీ కోసం వర్క్ చేస్తే కనీసం డబ్బులు ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏజెంట్ శ్రీను ఈమేరకు స్పందించాడు. 

"ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్ గా చూస్తారు. వచ్చేదాకా మంచిగా మాట్లాడతరు.. వెళ్ళాక కనీసం పట్టించుకోరు. డబ్బులు కూడా సరిగా ఇవ్వరు. దసరా సినిమా కోసం 23 మందిని గోదావరిఖని వెళ్ళాను. వారం రోజుల పాటు అక్కడే ఉన్నాము కానీ..ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. పైనుండి నాకే 70 వేలు ఖర్చు అయింది. నేను తీసుకెళ్లిన వాళ్ళు నన్నే కదా అడుగుతారు. నేను కూడా మొత్తం ఇవ్వలేదు సగమే ఇచ్చాను. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయని" చెప్పుకొచ్చాడు శ్రీను. 

ఇక ప్రస్తుతం శ్రీను చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.