
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి జూనియర్ డాక్టర్లు (జూడాలు) నిరవధిక సమ్మె చేయనున్నారు. బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచొద్దని… ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర వైద్య సేవల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు.