సీఎం ఆహ్వానం.. కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్

సీఎం ఆహ్వానం.. కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్

తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండడం ఆసక్తికరంగా మారింది.  సీఎం మసవరాజ్ బొమ్మై ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్కు ‘కర్ణాటక రత్న’ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు తారక్ తోపాటు రజనీకాంత్, రాజ్ కుమార్ కుటుంబం, జ్ఞానపీఠ్​ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, కన్నడ కవులు, కళాకారులు, రచయితలను ఆహ్వానించినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. 

జూనియర్ ఎన్టీఆర్ కు కన్నడ నాట కూడా మంచి జనాదరణ పొందారు. తన ఆహ్వానంపై కర్ణాటక అసెంబ్లీలో జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేశారని, రజనీకాంత్ ను కూడా ఆహ్వానించామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ వేడుకల్లో దివంగత నటుడు పునీత్​ రాజ్ కుమార్ కు కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం 'కర్ణాటక రత్న' అవార్డు ఇవ్వనున్నారు. కన్నడ ప్రజల్లో పునీత్ రాజ్ కుమార్ ​కు ఉన్న గౌరవానికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని సీఎం బొమ్మై చెప్పారు. పునీత్​ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అత్యున్నత ‘‘కర్ణాటక రత్న’’ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ రాజ్ నిలుస్తారు.