
- జీఎంబీహెచ్తో ఎంఓయూ
హైదరాబాద్, వెలుగు: అమ్మోనియా ప్లాంటు నిర్మాణం కోసం హైదరాబాద్ సంస్థ జూనో జౌల్ గ్రీన్ ఎనర్జీ, జర్మనీకి చెందిన ఇంధన సంస్థ సెలెక్ట్ ఎనర్జీ జీఎంబీహెచ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ములాపేట ఓడరేవు సమీపంలో ఎగుమతి- ఆధారిత గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్లాంటును నిర్మిస్తామని జూనో తెలిపింది. ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది.