మా వార్డులను పట్టించుకోరా?..జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా

మా వార్డులను పట్టించుకోరా?..జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా
  • జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా

కొల్లపూర్(నాగర్​ కర్నూల్), వెలుగు: కొల్లాపూర్​ మున్సిపల్​ చైర్ పర్సన్, కమిషనర్​ తమ వార్డుల అభివృద్ధికి ఫండ్స్​ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం కౌన్సిలర్లు గురువారం మున్సిపల్​ సాధారణ మీటింగ్​ బాయ్​కాట్​ చేశారు. అనంతరం మున్సిపల్​ ఆఫీస్​ ముందు ధర్నా చేశారు. పట్టణ ప్రగతిలో ఏ పనులు చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. మున్సిపల్​ చట్టం, నిబంధనలు పట్టించుకోని చైర్ పర్సన్, కమిషనర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. 

చైర్ పర్సన్, కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపాలిటీలో తమ వార్డు ఉందో లేదో చెప్పాలని 6వ వార్డు కౌన్సిలర్  రమ్య ప్రశ్నించారు. మంచినీళ్లు, ఇంటర్నల్​ రోడ్లు, చెత్త, కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.