- జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నేతలు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలోమంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సభా స్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులకు సభ విజయవంతం చేసేలా దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో డీసీసీబీ చైర్మన్అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్ అసెంబ్లీ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ , శ్రీహరి రావు, ముడుపు దామోదర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, నాయకులు గోక గణేశ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా విభాగం, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలి
నిర్మల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. కాంగ్రెస్ నిర్మల్నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు ఇంట్లో మంగళవారం ఏర్పాటుచేసిన తేనీటి విందుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని సూచించారు. కాం గ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఆత్మ చైర్మన్ రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి సాద సుదర్శన్, మైనార్టీ నాయకుడు అజార్ తదితరులు పాల్గొన్నారు.
