జ్యోతిష్యం : కర్కాటకరాశిలోకి గురుడు తిరోగమనం.. 12 రాశుల వారికి ఇలా ఉండబోతుంది..!

జ్యోతిష్యం  :  కర్కాటకరాశిలోకి గురుడు తిరోగమనం.. 12 రాశుల వారికి ఇలా ఉండబోతుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి.  నిర్దిష్ట కాలం తర్వాత ఒక్కో రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి.  దేవతల గురువు.. గురుడు ఈ రోజు    నవంబర్​ 11 న మంగళవారం సాయంత్రం 6:31 గంటలకు కర్కాటక రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఇదే స్థితిలో వచ్చే ఏడాది మార్చి 11 వరకు కదులుతాడు.   గురు గ్రహం గౌరవం, ధనానికి అధిపతి. ఇప్పుడు ఈ గ్రహం వక్రగతిలో ఉండటం వల్ల.. దీని ప్రభావం చాలా రహస్యంగా ఉంటుంది. దీని వలన కొన్ని రాశులపై అదృష్టం పెరగనుంది.  మరి, ఏ రాశి వారికి  ఎలాంటి  ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం...


మేషరాశి :  గురుడు కర్కాటక రాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి  సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలరు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో, ఆఫీసులో మీరు ఏది చెబితే అదే జరుగుతుంది. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనే మీ కల నెరవేరుతుంది.  వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగితే... విజయం మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  

వృషభరాశి : గురుడు  తిరోగమనం కారణంగా, ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా ఈ సమయంలో తీసుకొనే నిర్ణయం  లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. ఈ రాశి వారు  చేసే ప్రయత్నాలన్నింట్లో అద్భుత విజయం సాధిస్తారు.  పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో  పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. అంతిమ ప్రయోజనం మీదే అవుతుంది.

మిథునరాశి : గురుడు తిరోగమనం వేళఈ రాశి వారికి చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అద్బుతమైన లాభాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది. కెరీర్ విషయంలో  మంచి పురోగతి ఉంటుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు.

కర్కాటకరాశి :  ఇదే రాశిలో  గురు గ్రహంలోనే  తిరోగమనంలో సంచరిస్తోంది .   మీరు చేసే పనులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. డబ్బు ఎక్కువగా ఆదా కూడా చేయగలరు. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభాలు అందుకుంటారు. కాబట్టి... ఈ సమయం ఈ రాశివారికి మరింత ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.స్నేహితుల సహాయం లభిస్తుంది. కొందరికి విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

సింహరాశి:  గురుడు తిరోగమనం ఈ  సింహ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.    ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలను పొందొచ్చు.  వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

కన్యారాశి :ఈ రాశి వారు  ఈ కాలంలో కొత్త ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టడం.. వ్యాపార రంగాన్ని విస్తరించే అవకాశం ఉంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. 
అదృష్టం బలపడటంతో లాటరీ లేదా ఊహించని మార్గాల్లో ధన లాభం కలగవచ్చు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలకపాత్ర పోషిస్తారు.  మీ మాటకు విలువ పెరుగుతుంది. 

తులారాశి  : గురుడు  తిరోగమనం  ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ సంపద అమాంతం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. కొత్త  వాహనం లేదా ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లక్ ఎల్లప్పుడూ మీ తోటే ఉంటుంది. పిల్లల కోసం ఎదురుచూసేవారి కల ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని అవుతుంది.  ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అన్ని విధాలా శుభమే జరుగుతుంది. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారికి గురుడి తిరోగమనం వలన  శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పులొస్తాయి.  కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం చాలా మంచిది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. 

 ధనుస్సురాశి: గురువు తిరోగమనం కార‌ణంగాఈ  రాశి వారికి లాభాలు, విజ‌యానికి అవ‌కాశాలుంటాయి. గృహ సౌక‌ర్యాలు మెరుగ‌వుతాయి. అయితే, కుటుంబం గురించి కొన్ని స్వల్ప ఆందోళనలు పెరుగుతాయి. పెట్టుబడులు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఇది మీకు సమతుల్య సమయం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండ‌డం మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో ఆచరణాత్మకంగా ఉండ‌డం వ‌ల్ల ప్రయోజ‌న‌క‌రంగా ఉంటుంది.

మకరరాశి :ఈ రాశి వారు గురుడి ఆశీస్సులతో ఈ కాలంలో ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులు తమ ప్రణాళికలు విస్తరించడానికి ప్రయత్నిస్తారు. ఈ కాలంలో మీకు అనేక కొత్త మార్గాలు తెరచుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు  ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కుంభరాశి :ఈ  రాశి వారికి గురు గ్రహ వక్రగతి  కారణంగా గతంలో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి.  కుబేరుడి అనుగ్రహం లభించడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. . మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలౌతుంది. కొత్త గా ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించగలరు. కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం, లేదా జీతం పెరగడం లాంటివి జరుగుతాయి. అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మీనరాశి : ఈ  రాశి వారికి .. కర్కాటక రాశిలో గురుడు తిరోగమనంలో  సంచారం  వలన సానుకూల ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ బంధువులతో సంబంధాలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు మళ్లీ మెుదలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. గత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.