కుంభ లగ్నంలో పుట్టిన వారికి 2026 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాది గురు గ్రహం ఉచ్చ రాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెడుతున్నాడు. అంటే గురుడు చాలా శక్తివంతుడు అవుతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే.. మీ దగ్గర ఒక ఖరీదైన కారు ఉంది, కానీ దాన్ని మీరు ఎత్తుపల్లాలున్న రోడ్డు మీద నడపాల్సి వస్తోంది. ఫలితం బాగుంటుంది కానీ, ప్రయాణం అంత సులభం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి గురు గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. ఈ అద్భుతమైన మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబ విషయాల్లో తిరుగులేని విజయాలు దక్కనున్నాయి.
మీ సంపాదనకు, లాభాలకు గురుడే యజమాని. ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి మీ ఆదాయం పెరగవచ్చు. డబ్బు 'అదృష్టం' కొద్దీ ఊరికే రాదు; మీ 'కష్టం' కొద్దీ వస్తుంది. ఆఫీసులో పని భారం పెరుగుతుంది, కానీ ఆ పనికి తగ్గ గుర్తింపు, ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల, బోనస్ కచ్చితంగా ఉంటాయి. ఇక పోటీ పరీక్షలు రాసే వారికి, ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి కలిసొస్తుంది.
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, సర్వీస్ రంగం, హాస్పిటల్స్, బ్యాంకింగ్, లా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ కాలం అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే వాదనలకు దిగకుండా, మీ పని మీరు చేసుకుపోతే సరిపోతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. చాలా కాలంగా వేధిస్తున్న అప్పులు తీరిపోయే అవకాశం ఉంది. కొందరు ఇల్లు లేదా ఆస్తి కోసం ఆర్ధికంగా కలిసిరావొచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ కాలం కలిసి వస్తుంది.
మీరు చేయవలసిన పనులు
ప్రతి గురువారం "ఓం గురవే నమః" అని 108 సార్లు జపించండి. వీలైనప్పుడు అన్నదానం చేయండి. బట్టలు లేదా పప్పు దినుసులు దానం చేయడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే.. 2026లో కుంభ లగ్న జాతకులకు గురుడు కష్టపడితేనే ఫలితం అనే విషయంలో నేర్పిస్తూనే, మీ అకౌంట్‌లో డబ్బును, సమాజంలో గౌరవాన్ని పెంచుతాడు. ఈ విధంగానే మీరు కర్కాటక రాశిలోని గురుడి నుండి ఉత్తమ ఫలితాలను పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
