కర్నాటక నుంచి తగ్గిన వరద ఉధృతి.. జూరాల గేట్లు క్లోజ్‌‌

కర్నాటక నుంచి తగ్గిన వరద ఉధృతి.. జూరాల గేట్లు క్లోజ్‌‌

గద్వాల, వెలుగు: కర్నాటక నుంచి వరద ఉధృతి తగ్గడంతో జూరాల గేట్లను సోమవారం రాత్రి క్లోజ్‌‌ చేశారు. జూరాల వద్ద ప్రస్తుతం 318.140 మీటర్ల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌‌కు 62 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ఇక్కడి నుంచి విద్యుత్‌‌ ఉత్పత్తి కోసం 44,966 క్యూసెక్కులు, రైట్‌‌ కెనాల్‌‌కు 700, లెఫ్ట్‌‌ కెనాల్‌‌కు 1,190  కలిపి మొత్తం 49,923 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.