
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను ఓపెన్ చేసి 66,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,635 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ 1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550, రైట్ కెనాల్ ద్వారా 280, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, బీమా లిఫ్ట్ -2కు 750, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,00,183 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.