రూ.50వేల జీతం ఎవరికిస్తున్నారో చెప్పాలి

రూ.50వేల జీతం ఎవరికిస్తున్నారో చెప్పాలి

తెలంగాణ ఉద్యమ సమయంలో యూనియన్లే సీఎం కేసీఆర్ కు అండగా నిలిచారని ప్రజా తెలంగాణ పార్టీ నేత, జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. సోమాజి గూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పూటకో మాటమాట్లాడుతున్నారని చంద్రకుమార్ అన్నారు. 50వేల మంది కార్టీసీ కార్మికులతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు చెల్లిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏమన్నారో సోషల్ మీడియాలో చూస్తే తెలిసి పోతుందన్నారు. కేసీఆర్ ది నోరా ..మోరా అనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అలా మాట్లాడడం సమంజసం కాదని సూచించారు. పూటకో మాటమాట్లాడుతుంటే వ్యవస్థమీద, ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం పోతుందన్నారు.  ఒక్కో ఆర్టీసీ కార్మికునికి రూ.50వేలు చెల్లిస్తున్నామని చేసిన కేసీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. యూనియన్లు అవసరం లేదని మాట్లాడడం దారుణమన్నారు. స్వాతంత్ర్యానికి ముందునుంచే యూనియన్లు ఉన్నాయని సూచించారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని సర్కారు చెబుతుందని తెలిపారు. మరి ప్రభుత్వం అప్పుల్లో లేదా అని జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు.