కొండగట్టులో జేష్ఠ్యాభిషేక వేడుకలు

కొండగట్టులో  జేష్ఠ్యాభిషేక వేడుకలు

కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో జేష్ఠ్య మాసాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని సోమవారం జేష్ఠ్యాభిషేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాలయంలోని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. 

పంచామృత అభిషేకం నిర్వహించారు. 108 కలశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.