హర్యానా యూట్యూబర్ కేసులో ట్విస్ట్..పాకిస్తాన్ ఎంబసీ వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఫోటో వైరల్

హర్యానా యూట్యూబర్ కేసులో ట్విస్ట్..పాకిస్తాన్ ఎంబసీ వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఫోటో వైరల్

హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో కొత్త ట్విస్ట్..జ్యోతిమల్హోత్రాకు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు కేక్ తీసువెళ్లిన వ్యక్తితో మల్హోత్రాతో కలిసి ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ ఫొటోలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో ఉన్న ఫొటో బయటికి వచ్చింది. పాక్ పర్యటనలో ఉన్నప్పుడు జ్యోతి ఆ వ్యక్తితో కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గాం దాడి తర్వాత దేశవ్యాప్తంగా సామాజిక  వ్యతిరేక శక్తులపై నిఘా సంస్థలు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో  భారత్ కు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ తో షేర్ చేసుకున్నట్లు అరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లోని సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ తో పరిచయం పెంచుకున్న మల్హోత్రా..2024లో రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లివచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో పాకిస్తాన్ అధికారి ఆహ్సాన్ ఉర్ రహీమ్ ను కలిసిందని సున్నితమైన సమాచారాన్ని చేరవేసిందని ఆరోపించారు. ఆమెపై BNS సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923 సెక్షన్లు 3, 4 ,5 కింద ఆరోపణలతో  కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఆమెను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు.

హిసార్ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ శశాంక్ కుమార్ సావన్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్హోత్రాను ఇండియాలో ఒక ఆస్తిగా అభివృద్ది చేస్తున్నారు. ఇతర యూట్యూబర్లు, పాకిస్తానీ జాతీయులతో సంబంధాలు కొనసాగించారని తెలుస్తోంది. 

ALSO READ | హరాన్యాలో మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్

జ్యోతి ఇతర యూట్యూబ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్లతో టచ్ లో ఉందని.. వారు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స(PIO)తో  కూడా టచ్ లో ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. జ్యోతి స్పాన్సర్ ట్రిప్ లద్వారా పాకిస్తాన్ వెళ్లేది. పహల్గాం దాడికి ముందు ఆమె పాకిస్తాన్ లో ఉందని పోలీస్ అధికారి తెలిపారు. పాక్ తో జ్యోతికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.