కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. దాదాపు 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సింధియా.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. అంతకుముందు ఈ రోజు ఉదయం ప్రధాని మోడీతో సమావేశమైన తర్వాత సింధియా ఈ నిర్ణయం తీసుకున్నారు. సింధియా రాజీనామాతో కమల్‌నాథ్ సర్కార్ దాదాపు కూలిపోయినట్లేనని తెలుస్తోంది. ఎట్టకేలకు బీజేపీ తన మంతనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చి.. తన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సింధియాకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని కూడా సమాచారం. సింధియా గత ఏడాది నుంచి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తన లేఖలో పేర్కోన్నాడు. సింధియా తన రాజీనామా లేఖను మార్చి 9, సోమవారం రోజునే తయారు చేసి పెట్టుకున్నారు. మోడీతో చర్చలు సఫలమైతే వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చర్చలు సఫలం కావడంతో వెంటనే తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపి.. అదే లేఖను తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేశారు.

For More News..

ఎమ్మెల్యే దంపతులకు కేటీఆర్ క్లాస్.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?