30 శాతం కాదు 90 శాతం అక్రమాలు జరిగాయి: కేఏ పాల్

30 శాతం కాదు 90 శాతం అక్రమాలు జరిగాయి: కేఏ పాల్

ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. దేశ చరిత్రలో ఇలాంటి హింసాత్మక, మోసపూరిత ఎన్నికలను చూడటం ఇదే ప్రథమమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్ కాదని, మొత్తం సిస్టమ్‌లోనే లోటు పాట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల వేళ ఏకంగా ఈవిఎంలలోని చిప్‌నే మార్చేశారని పాల్ ఆరోపించారు.

హెలికాఫ్టర్‌కి వేస్తే .. ఫ్యాన్‌కు పడుతోందని పలువురు తన దృష్టికి తెచ్చారన్నారు. ఉత్తరభారతంలో ఏనుగుకు ఓటేస్తే కమలానికి పడుతోందన్నారు. చంద్రబాబు అంటున్నట్టు ఎన్నికల్లో 30 శాతం కాదని.. 90 శాతం అక్రమాలు జరిగాయని పాల్ అన్నారు. రేపు ఉదయం తాను ఢిల్లీకి వెళుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయంలో అన్ని పార్టీలు చేతులు కలిపాలని పిలుపునిచ్చారు. జాతిని కాపాడుకోవాలని.. తాను సీఎం అవుతానా లేదా, ఎంపీ అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదని దేశం ముఖ్యమని పాల్ అన్నారు.