ప్రజల ఐక్యతను ..దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర : కె.హేమలత

ప్రజల ఐక్యతను ..దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర : కె.హేమలత
  • మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో విద్వేషం
  • సీఐటీయూ అఖిల భారత  అధ్యక్షురాలు హేమలత

ముషీరాబాద్,వెలుగు : ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్రకు పాల్పడుతుందని, మతం, కులం, ప్రాంతం, భాష  పేరుతో విద్వేషం నింపుతుందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత ఆరోపించారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత హ్యాండ్లూమ్‌‌‌‌‌‌‌‌(చేనేత) కార్మికుల కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ..దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.  

రాష్ట్రంలో ఒకనాడు 1.50 లక్షల మగ్గాలుండగా, పాలకుల తీరుతో నేడు 40 వేల లోపు పడిపోయాయని తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. చేనేత కార్మికులు ఒకే తాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.  సీఐటీయూ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.