
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు పదవీ విరమణ చేసిన శాంతి కుమారి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. కొత్త సీఎస్‌కు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు, సెక్రటేరియెట్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతలు తీసుకున్న తరువాత రామకృష్ణారావు.. మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల సీఎస్‌లతో "ప్రగతి" సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై పీఎం సమీక్షించారు. సీఎస్‌తో పాటు స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.