
‘‘K-ర్యాంప్’’పై ఓ వర్గం కట్టకట్టుకుని చేస్తున్న ఫేక్ ప్రచారంపై, మూవీ నిర్మాత రాజేశ్ దండ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘‘లుచ్చా నా కొ*కు.. హిట్టు సినిమాని తొక్కాలని చూస్తుండు.. ఈ నా కొ*కుని నడిరోడ్డు మీద వీడ్ని ఉరి తీయాలి’’ అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రాజేష్ దండ వ్యాఖ్యలకు కొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్గా ఇవాళ (అక్టోబర్ 22న) నిర్మాత రాజేష్ దండ, తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘నా బాధ, కోపంలో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు.. మీడియా ముసుగులో సినిమాలను చంపుతున్న వారిపైన’ అని ట్వీట్ చేశారు.
‘‘మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం. నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. తెలుగు 360 వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది.
అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు.
గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.
ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా..నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపంలో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు.. మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్న వారిపైన అని’’ ఆవేదన వ్యక్తం చేస్తూనే వివరణ ఇచ్చారు రాజేష్ దండ
మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం.
— Razesh Danda (@RajeshDanda_) October 22, 2025
నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు…
నిర్మాత రాజేశ్ దండ (అక్టోబర్ 21న) మూవీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘‘మొదట మా సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మా నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ సక్సెస్ అందుకుంది. ముందునుంచీ మాది ఫ్యామిలీ మూవీ అని చెబుతూ వచ్చాం. మేము చెప్పినట్లే అందరూ సినిమాను ఇష్టపడుతున్నారు’ అని చెప్పారు. ఇక ఇదే వేదికపైనే రాజేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘K-ర్యాంప్' బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయినా సరే ఒక వెబ్ సైట్ ఇంకా మా మీద ఏడుస్తూనే ఉంది.
అమెరికాలో ఉన్న వాడికి చెప్తున్నా.. పగలగొడతా.. నీకేం తెలుసురా లుచ్చా నా కొ*కా.. 'డ్యూడ్' సినిమాకి 190K, నా సినిమాకి 46K అని ఏవేవో కలెక్షన్స్ వేస్తున్నావ్. అది తెలుగు, తమిళం కలిపిరా కుక్కా.. సినిమాని తొక్కుతావా. నువ్వు మగాడివైతే తొక్కురా.. ఒక మొగోడిగా చెప్తున్నా. ఒక్క హిట్టు సినిమాని తొక్కేయాలని వీడు ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ వేస్తున్నాడు. ఈ నా కొ*కుని ఏం చేయాలి.. నడిరోడ్డు మీద వీడ్ని ఉరి తీయాలి. మా మీద బతికే నా కొ*కా’’ అంటూ నిర్మాత రాజేష్ దండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.