రాష్ట్ర క్రీడాకారుల సంక్షేమానికి, క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని స్పోర్ట్స్ అథారిటీ గౌరవాన్ని ఇనుమడింప చేసే విధంగా పక్కా ప్రణాళిక, కార్యాచరణతో ముందుకెళ్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనారెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ నూతన చైర్మన్ గా జూలై 13న జిఎంసి బాలయోగి స్టేడియంలో కే. శివసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. క్రీడా కుటుంబ సభ్యులందరం టీం వర్క్ తో పని చేస్తామని, పదేండ్ల విధ్వంసం నుండి వికాసం వైపు క్రీడారంగాన్ని నడిపిస్తానని ఆయన హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు హాజరైయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు కోచులు, సిబ్బంది ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గం వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్.రమేష్ పలువురు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొని నూతన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శివసేన రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.