కమల్ హాసన్‌ ఆత్మీయ పలకరింపు

కమల్ హాసన్‌ ఆత్మీయ పలకరింపు

కమల్ హాసన్‌తో  సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి క్లాసికల్ చిత్రాలు తీశారు కె.విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గత నలభై ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతోంది. వరుస షెడ్యూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్నప్పటికీ, బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన నివాసంలో కలిశారు కమల్. విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలకరించారు. కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకతో విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఎంతో సంతోషించారు.  ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాయి.