బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే: కేఏ పాల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే: కేఏ పాల్

బుధవారం ( నవంబర్ 26 ) అమీర్ పేట్ లోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. తెలంగాణ పరిస్థితి ఘోరంగా ఉందని.. లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముకొని బినామీలకు అంటగడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఇవేస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు కేఏ పాల్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని అన్నారు కేఏ పాల్.

జూబ్లీహిల్స్ లో ఓట్లు చీలవద్దని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అభ్యర్థన మేరకే ప్రజా శాంతి పార్టీ పోటీ చెయ్యలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లను ఒక్కటి కూడా నెరవేర్చలేదని... కాంగ్రెస్ ప్రజలకు చెప్పిన ఒక్క హామీ కూడా తీర్చలేదని మండిపడ్డారు కేఏ పాల్. మూడు రోజుల్లో తన భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని అన్నారు. భట్టిని ముఖ్యమంత్రి చెయ్యడానికి రెడ్డి నేతలు అందరు కలిస్తే రేవంత్ కు నేను మద్దత్తు ఇచ్చానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే భూములు అన్నీ అమ్మి పడేస్తున్నారని..రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ నాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకొని వస్తానని అన్నారు కేఏ పాల్. బీజేపీకి డిపాజిట్ రాని అభ్యర్థిని జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీలో నిలిపారని అన్నారు. కాంగ్రెస్ బీహార్ లో ఓటు చోరీ అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ లో ఓటు చోరీ జరగలేదా అని ప్రశ్నించారు.

మహారాష్ట్ర లో ఏక్ నాధ్ షిండే మాదిరిగా తెలంగాణలో పరిస్థితి తయారయ్యిందని.. చాలా మీడియా సంస్థలు అమ్ముడు పోతున్నాయని అన్నారు. తెలంగాణ లో ఉన్న అందరు సర్పంచ్ అభ్యర్థులకు ప్రజా శాంతి పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు కేఏ పాల్. ఎన్నికల ముందు అన్నిసార్లు కాల్ చేసిన మల్లు రవి ఎన్నికల తరువాత మొఖం చాటేశారని అన్నారు.