కవిత అరెస్ట్ పై.. కేఏ పాల్ జోస్యం.. 48 గంటల్లో..

కవిత అరెస్ట్ పై.. కేఏ పాల్ జోస్యం.. 48 గంటల్లో..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA  కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ పై జోస్యం చెప్పారు. ఈడీ నోటీసులు అందుకు కవిత.. ఢిల్లీలో విచారణకు హాజరవుతారని.. రెండు రోజులు విచారిస్తారని చెప్పుకొచ్చారు పాల్. మార్చి 10వ తేదీ.. అంటే 48 గంటల్లో అరెస్ట్ ఖాయం అని జోస్యం చెప్పారు.  తెలంగాణ  రైతులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల కన్నీరు ఉసురు.. కేసీఆర్ కుటుంబానికి తగిలిందని శాపనార్థాలు పెట్టారు పాల్. కేసీఆర్ కుటుంబం.. దేవుడినే శత్రువు చేసుకున్నారని.. తగిన శాస్తి జరిగిందంటున్నారాయన.

ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు  సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీనే అరుణ్ రామచంద్ర  పిళ్లయ్​ అని కోర్టు రిమాండ్ రిపోర్ట్ లో అభియోగాలు నమోదు చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే.. కవితకు నోటీసులు పంపించింది ఈడీ. మార్చి 9వ తేదీ ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని కోరింది. మీరు చెప్పిన తేదీకి విచారణకు హాజరుకాలేనంటూ కవిత లేఖ రాయటం కూడా జరిగిపోయింది. ఈడీ సమాధానం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండో స్పిరిట్ గ్రూప్‌లో పిళ్లయ్​ పార్టనర్ గా ఉన్నారు.  ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండో స్పిరిట్‌లో పిళ్లయ్ కి 32.5 శాతం వాటా ఉండగా.. ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉన్నట్లు గుర్తించింది ఈడీ. 

ఈ పరిణామాల మద్య కేఏ పాల్ స్పందించారు.. కవిత అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పారు.. పాల్ చెప్పినట్లు నిజం అవుతుందా లేదా అనేది కూడ ఆసక్తిగా మారింది.