కేఏ పాల్ ప్రస్టేషన్ : దానం నాగేందర్పై ఎన్నికల సంఘానికి కంప్లయింట్

కేఏ పాల్ ప్రస్టేషన్ : దానం నాగేందర్పై ఎన్నికల సంఘానికి కంప్లయింట్

బీఆర్ఎస్  ఎమ్మెల్యే  దానం నాగేందర్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఆఫర్ల పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్కే భవన్ లో ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి కంప్లైంట్ చేశారు పాల్.  గులాబీ జెండా మోసే వాళ్లకు తప్ప వేరే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వబోమంటూ దానం నాగేందర్  బెదిరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు కేఏపాల్. మునుగోడు, హుజురాబాద్ లో కాంగ్రెస్ కు  డిపాజిట్లు రాలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అసలే లేదని.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ALSO READ: పరకాల ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. గ్రామాల్లో ధర్మారెడ్డికి నిరసనల వెల్లువ

బానిస బతుకు వద్దని.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ కావాలని అన్నారు కేఏపాల్. కాంగ్రెస్ బి టీమ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవదన్నారు. ఆశావాహులందరూ రూ.10వేలు కట్టి బి ఫామ్ పొందాలని సూచించారు. ప్రజాశాంతి పార్టీ  పోలీసులకు అండగా ఉంటుందన్నారు పాల్.