పరకాల ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. గ్రామాల్లో ధర్మారెడ్డికి నిరసనల వెల్లువ

పరకాల ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. గ్రామాల్లో ధర్మారెడ్డికి నిరసనల వెల్లువ

హన్మకొండ జిల్లా పరకాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హ్యాట్రిక్ మూడ్ లో ఉన్నారట. మొన్నటి దాక గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారట. కానీ.. MLA చల్లా ధర్మారెడ్డి పర్యటించిన ప్రతి ఊళ్లో ఎక్కడో ఓ చోట బ్రేక్ పడుతోందట. నిరసనలు, అందోళనలతో జనం ఎమ్మెల్యేని నిలదీస్తున్నారు. నడికుడ మండలం కౌకొండ, పరకాల మండలం వరికోల్ లో, ఆత్మకూరు, గీసుగొండ.. ఇలా ఎక్కడికి వెళ్లినా నిలదీతలే ఎదురయ్యాయి. మూడోసారి ఈజీగా గెలుద్దామంటే జనం నిరసనలు ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదట.

ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా ప్రత్యర్థులపై చల్లాకు భరోసా ఉండేనట. కాంగ్రెస్, బీజేపీ నుంచి తనకు అనుకూలంగా ఉండే ఇద్దరు ప్రత్యర్ధులకు టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారట. కానీ.. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు అభ్యర్ధుల్ని ప్రకటించకపోవడంతో పరేషాన్ అవుతున్నారట. ప్రత్యర్ధిగా ఎవరు వస్తారోనని కార్యకర్తలతో ఎమ్మెల్యే డిస్కషన్ చేస్తున్నారట. ఈసారి గెలుపు ఏలా ఉంటుందోనని మదన పడుతున్నారట చల్లా ధర్మారెడ్డి.

ALSO READ: కాంగ్రెస్లో ఆ నేతలకు కలిసిరాని డీసీసీ పదవి

పార్టీ పరిస్థితి ఒకలా ఉంటే.. ఇన్నాళ్లు తనవెంటే ఉన్న లీడర్లు ఒక్కొక్కరుగా చేజారిపోవటం ఎమ్మెల్యేను పరేషాన్ చేస్తోందట. అంతేకాదు..  తనకు వ్యతిరేకంగా రోడ్డెక్కడంతో ధర్మారెడ్డి టెన్షన్ పడుతున్నారట. నియోజకవర్గ ముఖ్యనేతలు దూరంగా ఉండటం, చల్లాకు వ్యతిరేకంగా కొందరు దర్నాలు, అందోళనలు చేస్తుండటంతో చల్లా సెల్ప్ డిఫెన్స్ లో పడ్డారన్న టాక్ నడుస్తోందట.