
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి కన్ఫ్యూజన్ వ్యక్తిని తన జీవితంలో ఇంత వరకు చూడలేదన్నారు. పవన్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ ను సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని..అది వారాహియాత్ర కాదు.. నారాహి యాత్ర అంటూ మండిపడ్డారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తూ ఏడాదికి 10 పార్టీలు మారారని విమర్శించారు కేఏపాల్. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితమని.. ఆయనకు స్థిరత్వం లేదన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఏపీలో ఒంటరిగా175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే తాను కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని చెప్పారు కేఏపాల్.
ఏపీ నాశనం కావడానికి ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడే కారణమన్నారు కేఏపాల్. మోడీ స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వలేదని.. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నా చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. జగన్ గెలిస్తే 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీ 10 లక్షల కోట్లకు చేరుతుందని తాను ఆనాడే చెప్పానన్నారు కేఏపాల్.