‘కచ్చా బాదామ్’ సింగర్‌కు యాక్సిడెంట్

‘కచ్చా బాదామ్’ సింగర్‌కు యాక్సిడెంట్

కోల్ కతా: ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించిన ‘భుబన్ బద్యాకర్’ ప్రమాదానికి గురయ్యాడు. రీసెంట్ గా కొనుగోలు చేసిన కారు నేర్చుకుంటుండగా ఈ యాక్సిడెంట్ సంభవించిందని తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. ట్రైనర్ సాయంతో కారు నేర్చుకుంటున్న సమయంలో భుబన్.. పొరపాటున బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బెంగాల్ లోని బీర్భూమిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భుబన్ ఛాతీకి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం సూరి స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. భుబన్‌ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే, కచ్చా బాదమ్ పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత భుబన్ బద్యాకర్ రాత్రికిరాత్రే స్టార్ గా మారిపోయాడు. బీర్భూమ్ జిల్లాలో పల్లీలు అమ్ముకునే భుబన్.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ పాటను పాడేవాడు. ఆ తర్వాత ఈ పాటను రీమిక్స్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే 90 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాపులారిటీ పెరగడంతో ఇకపై పల్లీలు అమ్మబోనని భుబన్ చెప్పాడు. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామానికి చెందిన భుబన్ కు ముగ్గురు పిల్లలున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

నాలుగు రోజులుగా బంకర్ లోనే..