
పటిష్టమైన బందోబస్తు మధ్య కడప నగరంలోని EVM లను స్ట్రాంగ్ రూం కు తరలించారు. ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కడప సిటీలోని కెఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడికి మరో 7నియోజక వర్గాలకు చెందిన ఈవీఎం మిషన్లు చేరుకోవలసివున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ రోజు కడపలో గొడవలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈవీఎంలపై దాడులు చేస్తారన్న అనుమానంతో భారీ భధ్రత మధ్య తరలిస్తున్నారు. స్ట్రాంగ్ రూంలకు మూడంచెల నిఘావర్గాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. సీసీకెమెరాల నిఘా మధ్య మరో 45 రోజులు EVMలు స్ట్రాంగ్ రూంలో ఉండనున్నాయి. అభ్యర్థుల సమక్షంలో పంచనామాను నిర్వహించి స్ట్రాంగ్ రూంలకు సీల్ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.