
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదనగా మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబానికి పెద్ద దిక్కు, పెదనాన్న మరణం తమకు తీరని లోటు అన్నారు. ఆయన మరణంపై తమకు అనుమానాలున్నాయన్నారు. కుట్ర చేసి వివేకాను చంపేసి ఉంటారని… ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.